Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ఆలయ దసరా ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజిబాబు

శ్రీ మావుళ్ళమ్మ దసరా ఉత్సవాల కరపత్రం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం: అక్టోబర్, 7
(తెలుగు న్యూస్ పవర్.కామ్) భీమవరం, శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 11 నుంచి 20వ వరకు శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు జరుగుతాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు బుధవారం ప్రకటించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దసరా ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. అమ్మవారికి ఈనెల 11 నుంచి 20 వ తేది వరకు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ విజ్ఞప్తి చేశారు. అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు10 రోజులుపాటు జరుగుతాయని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సౌకర్యాలను, క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 22న అన్న సమారాధన జరుగుతుందన్నారు. ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం, ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, పాలకవర్గ సభ్యులు రామాయణం శ్రీనివాసరావు అతికాల ఆంజనేయప్రసాద్ ఉడిసి మీనాక్షి మిర్తిపాటి గుణ్ణేశ్వరావు, స్థానిక నాయకులు కారంపూడి నాగేశ్వరావు గుసిడీ సూరిబాబు, మలువలస రాము తదితరులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.