Skip to main content

Telugu News Power

శ్రీ మావూళ్ళమ్మ హుండీ ఆదాయం సుమారు రూ.33.27 లక్షలు. ఇతరాలు అదనం.

అమ్మ వారి హుండీ ఆదాయం లెక్కింపు దృశ్యం

భీమవరం: అక్టోబర్, 7
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా ,భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో బుధవారం హుండీలు తెరచి లెక్కించారు. హుండీల ద్వారా 40 రోజుల కాలానికి రూ.33,27,757.ల ఆదాయం వచ్చింది. అమెరికా డాలర్స్ 50, సింగపూర్ డాలర్స్ 2 , మలేషియా నగరాస్ 5 , యూఏఈ దిర్హామ్స్ 10, విదేశి కరెన్సీ భక్తులు సమర్పించారు. బంగారం గ్రా.35.200 లు, వెండీ గ్రా. 144 లు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సింగరాయపాలెం శ్రీ వల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్ గంగా శ్రీదేవి పర్యవేక్షించారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు
బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గుణేశ్వరరావు,యండా సత్యవతి, పాపోలు ఏడుకొండలు, దేవదాయ ధర్మదాయ శాఖ భీమవరం తనిఖీదారు పి ఎస్ సాయికుమారి, భీమవరం యూనియన్ బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.