Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ దేవాలయానికి శ్రావణ శుక్రవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు.

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు.

అమ్మవారికి గాజులతో రెండో శుక్రవారం విశేష అలంకరణ.భీమవరం: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మహాలక్ష్మి స్వరూపిణీ, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా, దేవస్థానం ఆస్థాన మండపంలో ప్రత్యేకంగా ఉత్సవమూర్తి కి శ్రీ గజలక్ష్మి అలంకారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు, దర్శనం చేసుకొని అధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు..శ్రావణమాసం రెండవ వారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని ఈ నెల 21న శ్రీ అమ్మవారికి భక్తులచే సమర్పిస్తారు. గాజులతో పెద్ద ఎత్తున గాజులతో అలంకరిస్తారు. సౌభాగ్యం కోసం భక్తులుశ్రీ అమ్మవారి అలంకరణకు సమర్పించదలచిన గాజులు దేవస్థానం కౌంటర్ వద్ద సమర్పించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,వుదిసి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష,కారెంపూడి ఆదిలక్ష్మి,అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం మిర్తిపాటి గుణేశ్వరరావు,మల్లువలస లక్ష్మి నిర్మల,గొంతిన రమణ,యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు, ఎక్స్ అఫీషియో మెంబర్ బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు.