Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ వారి స్వర్ణ ప్రాజెక్ట్ కు కమిటీ ఏర్పాటు.

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు

భీమవరం: మే,20(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయనిధికి కమిటీ ఏర్పాటు చేశారు. నీ మ్యారేజ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో 12 మంది సభ్యులు,3 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. ఈ కమిటీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ మయ నిధికి 27 కిలోల బంగారం సహకరించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇప్పటికే 51కేజీల బంగారం వివిధ ఆభరణాల రూపంలో ఉంది. స్వర్ణమయ నిధికి 23 కేజీల బంగారం భక్తులు సమర్పించారు.
స్వర్ణమయ కమిటీ: ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, దేవాదాయ శాఖ అధికారి, బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్, రమేష్ కుమార్ అగర్వాల్, ఎం వీర వెంకట సత్యనారాయణ, బి మోహనరావు, కే వెంకట రమణారావు, ఎస్ వీర వెంకట సత్యనారాయణ, బి రామ్మోహన్రావు, బి నాగభూషణం, పి బాపిరాజు, జి వెంకటరమణ కమిటీ సభ్యులుగా ఉంటారు.