Telugu News Power

పట్టణంలో మందుల షాపుల బంధు విజయవంతం.

పాలకొల్లు మందుల షాపుల నిరసన ర్యాలీ
బంధు సందర్భంగా మూసివేసిన మందుల షాపు

పాలకొల్లు: మే, 20 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
సంప్రదాయ మెడికల్ షాపుల ఉనికిని దెబ్బతీస్తున్న ఆన్లైన్ ఔషధ విక్రయాల పట్ల దేశవ్యాప్తంగా మందుల షాపుల బంద్ కార్యక్రమం బుధవారం పాలకొల్లులో విజయవంతం అయ్యింది. మందుల షాపుల యజమానులు, ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు. కార్పొరేట్ రంగం అనైతిక వ్యాపార చర్యలతో మందుల షాపులపై ఆధారపడి జీవిస్తున్న వారి పొట్ట కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ డిస్కౌంట్ ల ద్వారా సాంప్రదాయ ఔషధ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న కార్పొరేట్ సంస్థలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆన్లైన్ ద్వారా ప్రమాదకరమైన, నిషేధిత మందులు అమ్మటాన్ని
అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాలకొల్లు పురవీధుల గుండా ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో పట్టణ, గ్రామీణ ప్రాంత మందుల షాపుల యజమానులు సిబ్బంది పాల్గొన్నారు. అఖిలభారత మెడికల్ అసోసియేషన్, అధ్యక్షులు జిఎస్ షిండే, కార్యదర్శి రాజివ్ సింఘాల్ పిలుపుమేరకు దేశవ్యాప్త బంద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించారు. మందుల షాపుల నిర్వహణకు భారీ వ్యయం అవుతున్నదని, కోట్లాదిమంది ప్రజలు ఈ వ్యాపారం ద్వారా జీవము సాధిస్తున్నారని, ఆన్లైన్ వ్యాపారం వీరి జీవనోపాధిని దెబ్బతీస్తుందని జిల్లా అధ్యక్షులు తరవాతి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్దకు చేరిన ర్యాలీ, తహసిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ కు బంద్ డిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో, ప్రధాన కార్యదర్శి, ఏ. చలపతి, కోశాధికారి జి వి ఆర్ ఫణి, సాయి కృష్ణ మెడికల్ ఏజెన్సీస్ అధినేత సుధాకర్ రావు, అమరావతి మెడికల్స్ గోపాల రాజు, వెంకటేశ్వర మెడికల్ స్కూల్ అధినేత అందే హరి, దాసరి మెడికల్ బాలాజీ, టిఆర్ఎం రామలింగేశ్వర రావు, రామకృష్ణ మెడికల్స్ బాలకొండలరావు, సాయి దుర్గ మెడికల్స్ పిల్లా సత్తిబాబు, సాయి చైతన్య మెడికల్స్ కూనపురెడ్డి సుబ్బారావు, ఈశ్వర మెడికల్స్ రమేష్, బొండాడ మెడికల్ రాజి, వేణు మాత్రి మెడికల్స్ రవి, విజయ శ్రీ మెడికల్ శ్రీరాములు, వారి సిబ్బంది నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.