Telugu News Power

నాటి విధ్వంస పాలన, నేటి అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలు బేరిజు వేసుకోవాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు

వరిధనం శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆనాడు ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసపాలన ప్రారంభమైందని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. మండలంలోని వరిధనం, దిగమర్రు, పెదమామిడిపల్లి, కొత్తపేట, పాలకొల్లు రూరల్ లో రూ. 1.90 కోట్లతో ప్రారంభించబోయే అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవపరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వరిధనంలో ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం ఎక్కిన కొమ్మనే నరుక్కున్నట్టు, కలెక్టర్ల మీటింగ్ నిర్వహించిన ప్రజావేదికను కూల్చివేసే వికృత మనస్తత్వం గల జగన్ పాలనను, రెండేళ్లుగా జరుగుతున్న కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు బెరీజు చేసుకోవాలని మంత్రి నిమ్మల కోరారు. పోలవరం ప్రాజెక్టును ముంచేసి, అమరావతిని నాశనం చేసి, పెట్టుబడిదారులను తరిమేసిన జగన్ ప్రభుత్వానికి, అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పరుగులు పెడుతున్న కూటమి ప్రభుత్వ పాలనకు పొంతన లేదన్నారు. స్థానిక వైయస్సార్ పార్టీ నాయకులు ఇటీవల చేస్తున్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. స్థానిక వైసీపీ నాయకులు జిల్లా పరిషత్ అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా, టీటీడీ బోర్డు సభ్యులుగా పదవులు అనుభవించి, సొంత గ్రామం ఆగర్తిపాలెంకు ఇసుమంతు కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయితే, అన్ని పార్టీల తలుపులు మూసుకుపోగా, మళ్లీ సొంత ఇంటి తలుపు తట్టిన ఆ నాయకుడు, మరో నాయకుడు వార్డులో పట్టుమని ఒక 50 ఓట్లు కూడా తెచ్చుకోలేని వారు కూడా, ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న వారు నియోజవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. వేసవిలో పట్టణంలో మంచినీటి సమస్య ఇప్పటిది కాదని, వైసీపీ పాలలో కూడా ఒంటిపోట నీరు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. మంచినీటికి కటకటలాడకూడదని ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తగా పట్టణ ప్రజల కోసం ఒంటి పూట నీటి సరఫరా విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ప్రజలను ఏమార్చి, వారిని మోసగించాలనుకునే వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. విజ్ఞులైన ప్రజలు వారి మాటలు నమ్మే స్థితిలో లేరని గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించే అభివృద్ధి ఫలాలను దక్కకుండా చేయాలనుకునే వైసిపి పార్టీ కుట్రలు ప్రజలు నమ్మరని తెలుసుకోవాలన్నారు. ముమ్మారు, నమ్మి 6 వేలు, 18 వేలు, 70 వేలు ఓట్ల మెజారిటీ ఇచ్చి అభివృద్ధి పనుల పట్ల ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారని మంత్రి తెలిపారు. అభివృద్ధే మంత్రంగా ఓటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో, తహసిల్దార్ యడ్ల దుర్గ కిషోర్, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, దొడ్డ ఏడుకొండలు, మాతరత్నం రాజు, ఇంటి శ్రీరాముడు, పాముల రజనీ కుమార్, ఉన్నమట్ల కపర్ది, పోతుల సూరిబాబు, తమ్మినీడి చంద్రశేఖర్, దాక్షారపు జ్యోతి, కొలకలూరి అర్జునరావు, రేపాక డేవిడ్ రాజు, కౌరు మురళి, అంబటి శేషగిరి, గుబ్బల కృష్ణమోహన్ పలువురు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.