Skip to main content

Telugu News Power

రెండో రోజు భారీగా నామినేషన్ లు వేసిన అభ్యర్థులు. పాలకొల్లులో 41, యలమంచిలి43.

జడ్పిటిసి, పోడూరు, అభ్యర్థి మిస్సమ్మ, టిడిపి నాయకులు సూర్యనారాయణరాజు రత్నరాజు
జడ్పిటిసి, యలమంచిలి స్థానానికి నామినేషన్ వేయడానికి వెళుతున్న వైసిపి నాయకులు, వర్మ, రవి, అభ్యర్థులు సుధారాణి రాజేశ్వరి.

పాలకొల్లు: అక్టోబర్, 22
(తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలో పూర్తి మండలాలైన పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో గురువారం రెండో రోజు అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. పాలకొల్లులో మొత్తం 41, యలమంచిలి మండలంలో43 నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారులు, మురళీకృష్ణ వెంకటరమణ, తహసిల్దార్ లు, యడ్ల దుర్గా కిషోర్, గ్రంధి పవన్ కుమార్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఉమామహేశ్వరరావు,
జేడివి ప్రసాద్ నామినేషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక సగం చెరువు స్థానం నుంచి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, కుమారుడు, రాజకీయ వారసుడు, వీరభద్ర కుమార్ (చిన్న ) నామినేషన్ దాఖలు చేయటం విశేషం. వీరి గెలుపు మండల అధ్యక్ష పదవికి మంచి మలుపు. తెలుగుదేశం పార్టీ ఈ మేరకు కూటమితో కలిసి నిర్ణయం ప్రకటించింది.
జడ్పిటిసి అభ్యర్థులు, దాసరి మిస్సమ్మ, మేడిది ఉషారాణి, పోడూరు, పాలకొల్లు స్థానాలకు, జిల్లా కేంద్రం భీమవరం, పరిషత్ కార్యాలయంలో టిడిపి తరఫున నామినేషన్లు సమర్పించారు. యలమంచిలి, జడ్పిటిసి స్థానానికి, వైసిపి పార్టీ తరఫున, ఇలపకుర్రు చెందిన తోట సుధారాణి, మేడపాడుకు చెందిన కుక్కల రాజేశ్వరి గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, తాజా మాజీ ఎంపీపీ పెనుకొండ ధనలక్ష్మి, మండల వైసీపీ నాయకులు రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జడ్పిటిసి, పోడూరు, అభ్యర్థి మిస్సమ్మ, టిడిపి నాయకులు సూర్యనారాయణరాజు రత్నరాజు