Telugu News Power

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం పూర్వ డాక్టర్ సబితా మహిళా జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సభకు శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. డి. ఏ. బకాయిలు, పి ఆర్ సి గురించి అన్ని వేదికల ద్వారా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి కూల్చే ప్రభుత్వం నుంచి, కాల్చే ప్రభుత్వం వచ్చినట్టు ఉందన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వ వాదన ఎంత మాత్రం సమర్థనీ యం కాదన్నారు. 3లక్షల కోట్ల బడ్జెట్ లో రూ.5700 కోట్ల నిధులు లేవనడం,ఇది సుబ్బిరామిరెడ్డికి రద్దు చేసినంత సొమ్ము కాదన్నారు. ఇది ప్రజల్ని మోసం చేయడమేనన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున వస్తే పేదలు కూడా
చదువుకో గలుగుతారని, పేదలకు వైద్యం అందించేందుకు 100పడకల ప్రభుత్వ ఆసుపత్రి వస్తుందన్నారు. ఇలాంటి ఆసుపత్రులును ప్రవేటు పరం చేయడం దుర్మార్గమైన చర్యగా ఖండించామన్నారు. పనిగంటల పెంపు, మహిళలు రాత్రి పూట పనిచేయడం తీవ్రంగా ఖండించారు. కంపెనీలకు ఉరికే పంచిపెట్టడం కుట్రపూరితమైన చర్యగా అభివర్ణించారు. ఈ సమావేశంలో పలువురు యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.