Skip to main content

Telugu News Power

మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన. -ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బోలిశెట్టి.

ట్రాక్టర్లు లాగుతున్న సాహసికుడు

ద్వారకాతిరుమల: జులై, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వీర్వా ఆసుపత్రి సమీపంలో నిర్వహించిన మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన, కళాకారులు ప్రదర్శించిన సాహస విన్యాసాలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, స్థానికులతో కలిసి తిలకించారు.
మన సంప్రదాయ జానపద కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బొలిశెట్టి పేర్కొన్నారు. ఈ కళలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు
చేరుతాయన్నారు. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులను అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, స్థానిక జనసేన నాయకులు, ఎన్‌డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో
ప్రజలు పాల్గొన్నారు.