Telugu News Power

వందేమాతరం గీతంకి నేటికీ 150 ఏళ్లు

భారత జాతీయ గీతం నేటికీ 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం వందేమాతర గీతంతతో మారుమ్రోగిపోయింది. బక్కిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం నాడు 35 కోట్ల ఆత్మగా విరాజిల్లుతూ, నేటి 150 కోట్ల మంది భారతీయుల సంగీత సంతకం సిగ్నేచర్ ట్యూన్ గా నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ధ్వనిస్తూ ఉంది. ఈ విశ్వంలో ఎక్కడ ఉన్న ఈ గీతంతో పులకించని భారతీయ హృదయం ఉండదు. తెల్ల ముష్కరుల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన గుండెలను చీల్చితే, వచ్చే ఉష్ణ రక్తకసారం నుంచి దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించిన చివరి శ్వాస వందేమాతరం. విరిగిన ప్రతి లాఠి ప్రేలిన ప్రతి తూటా విప్లవ వీరుల భౌతికకాయాన్ని చిద్రం చేస్తే, స్వాతంత్ర కాంక్షను సునామీలా చుట్టేసిన త్యాగఫలం ఈ స్వేచ్ఛా గీతం. ఈ జాతీయ భావ త్యాగాల పునాదుల మీద నిర్మితమైన ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం తత్వాన్ని ప్రోది చేసిన పవిత్ర గీతం వందేమాతరం. భారత రాజ్యాంగ సభలో జనవరి 24 1950లో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతి ఈ వందేమాతర గీతాన్ని జాతీయగీతం గా ప్రకటించారు. రాజ్యాంగ సభలో ఏకగ్రీవంగా ఆమోదించి ఈ గీతాన్ని ఆలపించారు .గౌరవ సూచంగా సభ్యులందరూ లేచి నిలబడ్డారు ఆనాడు జనం మానస గీతమై, స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన నిప్పు కణమై, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో దావాలనమై అధికార బంధనాలు బూడిద చేసి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన ఆగ్నేయాస్త్రం అయింది ఈ వందేమాతర గీతమే. 150 ఏళ్లు గీతామకరందాన్ని అందిస్తున్న వందేమాతర గీతానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తపాలా బిళ్ళ ను విడుదల చేశారు .ఈ సందర్భంగా ప్రతి పల్లెలో పట్టణంలో ప్రతి పాఠశాలలో శుక్రవారం ఉదయం జాతీయ గీతాన్ని తారకమంత్రంగా జపించారు, ఆలపించారు.ఈ జాతీయ గీతాన్ని పాలకొల్లు దాదాపు 18 వేల మంది విద్యార్థుల గొంతులు ఈ ప్రత్యేక సందర్భంలో ఉత్సాహంగా పాడాయి . మండల విద్యాశాఖ అధికారి గుమ్మల వీరాస్వామి ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. పాలకొల్లు ప్రధానోపాధ్యాయులు ఝాన్సీ లక్ష్మి బాయి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నమట్ల కపర్థి,రావూరి సుధా ,జక్కంపూడి కుమార్ ,అల్లూరి పద్మవర్మ ప్రసంగించారు. యలమంచిలి మండలంలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో వందేమాతర గీతాలాపన కార్యక్రమాన్ని ఎంఈఓ లు ఏ శ్రీవాణి, రామకృష్ణంరాజులు పాల్గొని పర్యవేక్షించారు. ఎలమంచిలి మండల పి.ఎం.పి అసోసియేషన్ సభ్యులు వందేమాతర గీతాలు ఆలపించారు .అధ్యక్ష కార్యదర్శులు జి పుల్లారావు కే రంగబాబు గంగాధర్ రావు సుబ్బారాయుడు వారి సభ్యులు పాల్గొన్నారు. తరం మారుతున్నా స్వరం మారని, గీతంగా వందేమాతర గీతం నిలవాలని ఆశిద్దాం. వందేమాతరం.