రోడ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం మంత్రి నిమ్మల
కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు ఐదు కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అడివిపాలెం మల్లంపల్లి నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రంలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రోడ్లు వేయడం వల్ల రవాణా వ్యవస్థ మెరుగుపడి, అభివృద్ధికి బాటలు వేస్తుందనే రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానం వల్ల కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నామన్నారు. గతంలో 143 కోట్లతో రోడ్లు వేసామన్నారు. ప్రస్తుత రోడ్డుకు గతంలో 21 కోట్లు నిధులు ఖర్చు చేశామన్నారు. పాలకొల్లు-మార్టటేర్
రోడ్డు 25 కోట్లతోనిర్మించామన్నరు. గతంలో ఈ రోడ్డు గోతుల్లో పడి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయన్నారు. వైయస్సార్ పార్టీ నాయకులు పదవులు పొందడానికి పోటీపడ్డారు తప్ప ,ప్రజలకు మేలు చేయడానికి ఏనాడు ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వంలో సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. తలకు రెండున్నర లక్షల అప్పుతో 14 లక్షల కోట్ల రుణవారం ప్రజలపై వేసిన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందన్నారు. అయినప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు సజావుగా కూటమి ప్రభుత్వం సాగిస్తుందన్నరు. గతంలో ఎక్కడ ఏ సభ జరిగినా పోలీసులు వందల మంది తన చుట్టూ వైఫైల చుట్టూ ముట్టి ఉండేవారన్నారు. నేడు మంత్రి హోదాలో ఉన్న పోలీసులు కనపడరన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు మాట్లాడుతూ, కల్తీ మద్యం కేసులో నిందితుడైన జోగి రమేష్ కులం కార్డు వాడాలని చూస్తున్నారని, బీసీలు ఎవరు తప్పు చేసిన వారిని క్షమించరన్నారు. సభలో బిజెపి నాయకులు కపర్ది, యర్రంశెట్టి పద్మారావు ,జనసేన నాయకులు తుల రామలింగేశ్వర రావు మాట్లాడారు. ఈ సభలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి ,చెరుకూరి అంజిబాబు, కడలి గోపి ఆరమిల్లి చిన్ని, మామిడిశేట్టి పెద్దిరాజు, పెచ్చటి బాబు ,గండి వెంకటేశ్వర రావు ,బొప్పన చిన్న ,చిలుకూరు బాలాజీ ,బత్తుల రాజు ఉండ్రాజవరపు బాబురావు పలువురు సర్పంచులు ఎంపీటీసీలు, కూటమి నాయకులు,స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత