
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మంత్రి నిమ్మల మరోసారి నిరూపించారు. స్థానిక గౌడ శెట్టిబలిజ బీసీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు మంత్రి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆకులో ఆకునై అన్నట్టు, అందరికీ తలలో నాలుకలా ఉండే ఎమ్మెల్యే నిమ్మల భవన నిర్మాణ కార్మికులతో చేతులు కలిపారు. స్వయంగా శ్రమదానం చేసి శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు. మెటీరియల్ మోసి, ట్రాలీ లాగి, తాను కూడా కార్మికుడిగా మారారు. చెమటలు కక్కుతూ పక్కవారిని పనిలో ఉత్సాహపరిచారు. వారి యోగక్షేమాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు కొండంత అండగా ఉంటుందన్నారు. బీసీలు అంటే టిడిపి, టిడిపి అంటే బీసీలు అని మంత్రి తెలిపారు. గతంలో ఈ కళ్యాణ మండపానికి కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి మొదటి స్లాబ్ పూర్తి చేసామన్నారు. ఇక ఆపై ఏ చిన్న పని జరగలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మూడు కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. పనులు చక చక జరుగుతున్నాయని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా ఉన్న రిజర్వేషన్ 34 శాతాన్ని 24 శాతానికి 24 శాతానికి కుదించిన బీసీ ద్రోహి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిందించారు. ఇందువల్ల 16 వేల పదవులు, స్థానిక సంస్థల్లో బీసీలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దగా చేసిన జగన్ బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు కమిటీ నాయకులు మేక కోటేశ్వరరావు, పీతాని వెంకట్ ,పెచ్చెట్టిబాబు, అప్పారి ఉమ ,అంగర చిన్న ,బి గంగాధర్ రావు ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్ ,కడలి గోపి మామిడి చెట్టు పెద్దిరాజు, చిట్టూరీ ఏడుకొండలు ,కుక్కల సత్యనారాయణ ,గోపాలకృష్ణ గుబ్బల ఏడుకొండలు, రాచమల్ల మీరయ్య ,కౌరు సందీప్ ,కేతరాజు,నున్న బోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
