Skip to main content

Telugu News Power

గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులపై శ్రద్ధ పెట్టాలి

డివిజనల్ పంచాయతీ అభివృద్ధి అధికారి రాణి.
యలమంచిలి: తెలుగు న్యూస్ పవర్,
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని గ్రామ కార్యదర్శులను నరసాపురం పంచాయతీ డివిజనల్ అభివృద్ధి అధికారిని రాణి కోరారు. యలమంచిలి మండలంలో ఓఎస్.ఆర్ పై శిక్షణా కార్యక్రమం జరుగుతున్నందువల్ల బుధవారం యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో వివిధ అంశాలపైసమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల తుఫాన్ వల్ల ఎదురైన పరిస్థితులను సిబ్బందితో సమన్వయం చేసుకొని పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలన్నారు. ఇంటింటికి వెళ్లి ఏమైనా ప్రజలు ఇబ్బందులు ఉంటే పరిశీలించి పరిష్కరించాలని కోరారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని ఆదేశించారు .మండల ఇంచార్జ్ ఎంపీడీవో జక్కం శెట్టి దుర్గాప్రసాద్ పలువురు పంచాయతీ కార్యదర్శులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.