
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ-4 విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ బుధవారం నిర్వహించింది. ఈ ర్యాలీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ కార్యాలయం, వై. యస్. ఆర్. వై జంక్షన్ నుండి గాంధీ బొమ్మల సెంటర్ మీదగా ఎమ్మార్వో కార్యాలయానికి చేరింది. ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రైవేట్ కాలేజీల్లో వైద్య విద్య పేద విద్యార్థులు చదువుకోడానికి అవకాశం ఉండదన్నారు. వెంటనే పి4 విధానాన్ని రద్దు చేయాలని ఎమ్మార్వో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇంచార్జ్ గుడాల హరి గోపాల రావు,గోపి మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు కూటమిప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు తమ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మభ్యపెట్టి గెలిచారన్నారు. కనీసం దగ్గులూరు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని మంత్రినీ కోరారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించి ఇప్పటికే అనేక దశల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేసి ప్రజల మద్దతు కూడగట్టామన్నారు. ప్రజలు గమనిస్తున్నారని,ఇలాంటి విధానాల వల్ల కూటం ప్రభుత్వం పతనానికి దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెమ్ ఆనంద ప్రకాష్ , చిలువూరీ కుమార దత్తాత్రేయ వర్మ, యడ్ల తాతాజీ,జడ్పిటిసి నడపన గోవిందరాజు నాయుడు, పట్టణ,،మండల అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ ,ఉచ్చుల స్టాలిన్, యేసు రాజు, కొర్రపాటి వీరస్వామి, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, కర్ర జై సరిత, మద్ద చంద్రకళ, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు రాష్ట్ర జిల్లా మండల గ్రామ వార్డు నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.
