అభివృద్ధి పథంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసిపి పార్టీ అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నదని బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నట్లు కపర్ది ఆరోపించారు. లంకల కోడేరు సహకార సంఘం అధ్యక్షులు నివాసంలో బుధవారం పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల17 మెడికల్ మెడికల్ కాలేజీలు
ప్రైవేటు పరం అవుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆందోళనలు చేపట్టి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పలుమార్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా ను కలిసి పీ ఫోర్ విధానం
ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో 17 మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రభుత్వానికి భారం కావున. పీ ఫోర్ విధానం తీసుకొచ్చారన్నారు. ఈ విధానాల్లో రిజర్వేషన్ల.కు ఎలాంటి ఆటంకం ఉన్నదన్నారు، నూరు శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు. 17 కాలేజీల్లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నహయాంలో తన పులివెందుల నియోజకవర్గంలోని వైద్య కళాశాల తప్ప మరి మిగతా కాలేజీలు పట్టించుకోలేదన్నారు. దగ్గులూరు వైద్య కళాశాలకు 450 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఈ కాలేజీకి వారు అధికారంలో ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదని నిందించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు కృషితో 75 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, వైఎస్ఆర్ పార్టీ వారి నాయకులు కార్యకర్తలు నిరసన తెలిపి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాలకొల్లు ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్ జనసేన జిల్లా నాయకులు తులా రామలింగేశ్వర రావు సొసైటీ అధ్యక్షులు పెనుమత్స సత్యనారాయణ రాజు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల పై వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు