Telugu News Power

ప్రశాంత్ కిషోర్ బుట్టలో పడని బీహార్ ఓట్లు

భారతదేశంలో బీహార్ రాష్ట్రం చాలా ప్రత్యేకమైనది.ఇక్కడ ఇంకా రాతియుగం నాటి సామాజిక ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. అత్యంత క్రూరమైన అంతర్గత ఊచకోతలు ఇక్కడి ప్రజలకు సుపరిచితం. నా మిత్రుడు ఒకరు బీహార్ కు చెందిన అనంత్ ఝా.ఇతను బీహార్ లో మనుగడ సాగించలేక ఢిల్లీకి చేరిన దేశం లోనే ఒక కాందీశీకుడుకుడు. ఇది నాకు ప్రత్యక్షమైన ప్రత్యక్ష అనుభవం. ఇక లోతుకు వెళితే ఇలాంటి సంఘటనలు ఎన్నో. మానవీయ విలువలకు అక్కడ అంతగా చోటు ఉండదు. అక్కడ నాయకులు పశువులు తినే గడ్డి మేస్తారు. ప్రజలు కూడా వారినే గుడ్డిగా నమ్ముతారు కూడా. బీహార్ గతంలో అత్యంత వెనుకబడిన, ఎక్కువ జనాభా కలిగిన, పేదరికం ప్రాతిపదికన కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందేది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై లబోదిబోమనేవారు. అంటే అభివృద్ధి ఉంటే నిధులు రావని వారు వాపోయే వారు. అలాంటి రాష్ట్రం నుంచి ఉద్భవించిన అత్యంత ప్రమాదకారి అయిన ఓ బీహారి కథ చూద్దాం. తండ్రి వైద్యుడు తల్లి గృహిణి.

రోతాస్ జిల్లాలో కోనార్ గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ నుంచి నిధులు అందుతున్న ఒక స్వచ్ఛంద సంస్థ లో ఆరోగ్య సంబందించిన మిషన్ లో విధులు నిర్వర్తించే
ఉద్యోగంలో2011 చేరాడు. అక్కడి నుంచి రాజకీయాలపై
కన్నేశాడు. అక్కడి నుంచి గుజరాత్ రాజకీయాల వైపు చూశాడు. అప్పటి ముఖ్యమంత్రి మోడీ కోసం2012 అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహకర్తగా మొదటిసారి విజయం సాధించారు. ఆపై సిటిజన్స్ ఫర్ ఎకౌంటబిలిటీ సీఏజీ2013లో ఏర్పాటు చేశారు. తదుపరి అందరికీ పరిచయమైన ఐప్యాక్ అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. ఈ కమిటీ ద్వారా అతను ప్రజల్లో బలహీనతల్ని అత్యంత హీనంగా అంచనాలు గట్టి కట్టి అందుకు అనుగుణమైన అరాచక, అమానవీయ వ్యూహాల్ని రచించేవాడు. ఇందులో ఐపాక్ సభ్యులే ప్రజల్లో ప్రజలుగా నాయకుల్లో నాయకులుగా రెండువైపులా ఒకరే ఉంటూ ప్రజల హృదయాల్లో లేనిపోని అలజడు సృష్టించేవాడు. ఇతను అన్నదమ్ముల వలే కలిసిఉండే వాళ్ళను కూడా తన కుచిత బుద్ధితో వాళ్ల మధ్య చిచ్చు పెట్టేవాడు. కావాలనుకుంటే కొంపలు తగలబెట్టించేవాడు. తద్వారా అప్పటివరకు నమ్మిన పార్టీ నుంచి వారి విధేయతను తను పనిచేస్తున్న పార్టీ వైపు మళ్లించడం అతని నైపుణ్యంలో ముఖ్యమైనది. కన్నవారినన్నా, సొంత రక్తసంబంధీకులన్న కూడా కనీసం జాలి లేకుండా లేపించేయడం ఈ రక్త పిపాసికి వెన్నతో పెట్టిన వ్యూహం. ఇతను ఏమాత్రం మానవత్వం ప్రదర్శించడు. శవాల పై ఓట్ల లెక్కలు కట్టే ఆపరా కిరాతకుడు. కంటి చూపుతో, కోడి కత్తితో, కారు డోరు తో గాయాలు చేయించి బ్యాండేజ్ లు వేయించి పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తారు. గణాంకాలు సేకరించి తను పనిచేసే పార్టీ కోసం ఇతర పార్టీలపై విషం కక్కుతుండం ఇతని కనికట్టలో ఒక భాగం. మనుషుల బలహీనతలు చెప్పుకోవాలంటే, బతుకు తెరువు అవకాశాలు లేని తల్లిదండ్రులు బిడ్డలను అమ్ముకోవడం, లేదా వయసొచ్చిన బిడ్డను డబ్బుల కోసం గతి లేక తార్చడం వంటి అత్యంత దయనీయ పరిస్థితులను అంచనా వేసి తను పనిచేసే పార్టీ కోసం అత్యంత నీచనికి దిగజారి, ఆయా పార్టీల నుంచి వందల కోట్లు కొల్లగొట్టే అత్యంత ప్రమాధికారి అయిన ఆర్థిక ఉగ్రవాదికి ప్రతిరూపం ప్రశాంత్ కిషోర్. పేరులో ప్రశాంతత ఉన్న అది తన వరకు మాత్రమే. అతను ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలో ప్రజలకు రాత్రి పగలు పీడకల, ఓ నైట్మేర్. ఆలా కునుకు లేకుండా చేస్తారు. ఈ వ్యూహాలతో బిజెపి,నితీష్ కుమార్, అమరేందర్ సింగ్, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ వంటి నాయకులు అతని నైపుణ్యం వల్ల పాదాక్రాంతులైయ్యారు. ఎందుకంటే పదవి వ్యామోహం అలాంటి ది. రాజకీయాల్లో అప్పటివరకు ఉన్న సహజమైన, ప్రజలపై అంతో ఇంతో మమకారం ఉన్న సాంప్రదాయ రాజకీయ నుంచి నాయకులు లను తన చెప్పు చేతల్లో ఉంచుకునేవారు. ప్రజల్లో పలుకుబడి కలిగిన నిజాయితీపరులైన నాయకులు కూడా ప్రశాంత్ కిషోర్ ముందు ఎందుకు కొరగాకుండా పోయారు. అతన్నే నెత్తిన పెట్టుకొని పూజించారు. అయితే అందరిని అన్నిసార్లు మోసం చేయలేరు. కొంతమందిని,కొన్నిసార్లు మాత్రమే మోసం చేయగలరు. ప్రశాంత్ కిషోర్ సాధారణంగా గెలుపు అవకాశమున్న పార్టీ వైపు తన చూపు ఉంటుందంటారు. అయితే ఇతను చేపట్టిన వ్యూహాలు బెడిసికోట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇతని రాక రాజకీయాలకు అతి భయంకరమైన, అసహజ తాత్కాలిక స్టెరాయిడ్స్ లాంటిది. ముందుగా చెప్పి, 30 ఏళ్లు ఆశ పెట్టి ,తర్వాత ఒక్కసారికే పదవి పోగొట్టి ,ఇంటికి ఇంటికి పంపే లోపాల వ్యూహాలూ ఇతనివే. అందరి బలం తనదేనని బ్రమలో పడి, మా ఊరు వాడు లేకపోతే కథ చెప్తాను అన్నట్టు ఉండాలి కానీ, తన సొంత రాష్ట్రంలో జన సురాజ్ పార్టీ స్థాపించాడు. బీహార్ ఎన్నికల్లో పోటీపడ్డాడు. తను మాత్రం ఎక్కడా పోటీ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక్కడ మాత్రం తన వ్యూహం కరెక్ట్ గా వర్కౌట్ అయింది. పార్టీ మొత్తం విజయానికి కనీసం దూరంలో కూడా లేకుండా బొక్క బోర్లా పడింది. మా ఊరి వాడు లేకపోతే కథ చెప్తాను అన్నది ఇక్కడ నిజమైంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ పుట్టిపెరిగింది అక్కడే కాబట్టి ప్రజలందరికీ వ్యూహకర్తని తెలిసిపోయింది. నిద్రలేని రాత్రులు గడపలేక ఏ ఒక్కచోట అధికారం గడప తొక్కినివ్వ కుండా,బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ ను పెట్టి నారతీశారు. ఈ మహా విషవృక్షాన్ని కూకటి వ్రేళ్ళతో సహా పెకలించి పారేశారు. ఈ లోపు, ఈ నీడలో కొన్ని కలుపు మొక్కలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అలాంటిదే,కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ,ముఖ్యమైన మహిళల బలహీనత ఆసరాగా చేసుకుని రచించిన ఉచిత బస్సు పథకం. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు దావానంలా అంటుకు పోతుంది. ప్రజల్ని ప్రజలుగా చూడాలి తప్ప వారు అమ్ముడుపోయే ఆట వస్తువులుగా,ఎరలు వేసి ఓట్లు ఏరుకొని అధికారం దక్కించుకోవడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు ఎందుకంటే తీసుకున్న వందల కోట్ల డబ్బుకు ఫలితాలు ఇవ్వడం వరకే అతని వంతు పని. ఆపై, మరుసటి రోజు నుంచి అతని ఉనికి కనపడదు. అధికారం వీరికి పులి మీద స్వారీ అవుతుంది. రాజకీయ పార్టీల భవిష్యత్తు ఒక్క పదవీకాలంతోటే ముగిసిపోతుంది.అందుకు ఆంధ్రప్రదేశ్ ఒక చక్కటి, కళ్ళ ముందు కదలాడే ఉదాహరణ. ప్రజలకు లేనిపోని ఆశలు, ఆచరణ వీలు కాని హామీలు ఇప్పించడం వ్యూహకర్తలకు సులువైన పని. ఆ తర్వాత రాష్ట్రం అప్పులపాలై, అలో లక్ష్మణ,అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి దిగజారటం. ఈ వ్యూహకర్తల పనే. బిడ్డలకు అవసరమైన విద్య ,ప్రజలకు పెద్ద పెద్దలకు అత్యంత అవసరమయ్యే వైద్యం అందితే ప్రజలు ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశాన్ని ఈ వ్యూహకర్తలు ఆదిలోనే తుంచేస్తారు. ఇలాంటి వారిని దేశ బహిష్కరణ చేయాలి. ప్రజల యొక్క సహజ ఆశలు, ఆశయాలు అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకుంటే ప్రజలు పార్టీ పరస్పరం నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగటం ఓ తప్పనిసరి అవసరం. కన్నతల్లికి అన్నం పెట్టినవాడు పిన్ని తల్లికి పట్టుచీర పెడతానంటే ఎంత వాస్తవమో, వ్యూహకర్తను నమ్ముకోవటం రాజకీయ పార్టీలు విజ్ఞతకు అంతే అవసరం. ఏదైనా మాయలు చేయించే మరాఠీ వల్ల కాదు. అది చేసే తోట రాముడు వల్లేనని బీహార్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. హాట్స్ ఆఫ్ టు బీహార్ ఓటర్స్.