పాలకొల్లు, నవంబర్,16(తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో 21వ కాపు వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహిస్తున్నట్టు కాపు ప్రముఖులు వంగా నరసింహారావు తెలిపారు. పాలకొల్లు బైపాస్ రోడ్ లోని ఎస్కన్వెన్షన్ ఎదురుగా ఉన్న స్థలంలో వనభోజనాలు జరుగుతాయి అన్నారు. దాదాపు 15 వేలమంది ప్రతి ఏట ఈ వనభోజనాలకు హాజరవుతారు అన్నారు. మహిళలకు పిల్లలకు యువకులకు దాదాపు పది రకాల ఈవెంట్స్ ఈ కార్యక్రమంలో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి అందరు కాపు ప్రముఖుల తో పాటు మధ్యతరగతి కాపు వారు కూడా సహకరించటం విశేషం అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు దాదాపు 15 లక్షల రూపాయలు విజయం అవుతుందన్నారు. దాదాపు నెల రోజుల నుంచి కార్యకర్తలు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నిర్విఘ్నంగా రాత్రి పగలు కృషి చేస్తున్నారన్నారు. కాపు జాతి ఏకతాటిపై రావడానికి ఓ గెట్ టుగ్యాదర్ గా కూడా ఈ కార్యక్రమం ఉంటుందని వంగా నరసింహారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడ్డాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడే 21వ పాలకొల్లు కాపు వనభోజన సమారాధన