పాలకొల్లు: నవంబర్, 23 (తెలుగు న్యూస్ పవర్)
కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పి పి పి విధానం లో వైద్య కళాశాల ఏర్పాటు ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందో ప్రజలకు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని
మాజీ న్యాయమూర్తి, జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయే 17 వైద్య కళాశాలలు పి పి పి పద్ధతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పాలకొల్లు మెడికల్ అసోసియేషన్ భవనంలో సమావేశం జరిగింది. ఈ సభకు కమిటీ కో-కన్వీనర్ లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పి పి మోడల్ విద్యార్థుల చదువులకు భవిష్యత్తులో గొడ్డలి పెట్టు అవుతుందిని ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం మెడికల్ కాలేజీలకు ఈ పద్ధతి ప్రవేశపెట్టి, రాబోయే రోజుల్లో పాఠశాలలో కూడా ఇదే విధానం తీసుకు వస్తారని భయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. అదే ప్రైవేటు ఆసుపత్రికి వేలితే డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తారా అని ప్రశ్నించారు. పి పి పి మోడల్ లో కూడా వైద్యం ఉచితంగా అందదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వభూముల, వనరులుతో ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అప్పనంగా ప్రజల సొమ్ము దోచుపెడుతుందని ఆరోపించారు. తొమ్మిది లక్షల కోట్ల గూగుల్ సంస్థకు 22 వేల కోట్లు ఇచ్చి రాష్ట్రానికి తీసుకువచ్చిన అన్నారు.మెడికల్ కాలేజీలు 50-60 ఏళ్ల పాటు ప్రైవేట్ చేతులు ఉంటే తిరిగి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఎలా వీలవుతుంది అని ప్రశ్నించారు. పి పి పి మోడల్ లో మొత్తం అన్ని కాలేజీలు టిడిపి రక్తసంబంధీకులకే కేటాయించడం జరుగుతుందని జోష్యం చెప్పారు. ఇందులో సినీ నటుడు,ఎమ్మెల్యే బాలకృష్ణకు తప్పనిసరిగా ఒక ఆస్పత్రి ఆసుపత్రి కేటాయిస్తారని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తనకు కూడా 20% కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. మోడీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును తిప్పుకొట్టిన విషయం మర్చిపోవద్దన్నారు.
. ఈ పి పి పి విధానం రద్దు కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని తెలిపారు. అధ్యక్ష ఉపన్యాసంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి వైద్య కళాశాల దాదాపు 100 నుంచి 150 కోట్ల లాభం పొందుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీల్లో ఉండే ఆసుపత్రిలో వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. అయితే పిపిపి మోడల్లో వైద్యం ఖరీదు అవుతుందన్నారు. ఇతర దేశాల్లో 70% పైగావిద్య వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. రాష్ట్ర సిపిఎం నాయకులు బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆదుకున్న విషయాన్ని కరోనాలో వెల్లడైందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మాత్రమే ఆక్సిజన్ అందచేసిందన్నారు. ఈ సభలో మాజీ ఎమ్మెల్య దిగుపాటి రాజగోపాల్, కే వినయ్ కుమార్ పటేల్, భీమారావు, దేవ సుధాకర్ తదితర వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు
