Telugu News Power

పాలకొల్లు చవాకుల ట్రస్ట్ కు ఇన్స్పైర్ అవార్డు

చవాకుల ట్రస్ట్ చైర్మన్ నరేష్ కు సన్మానం

పాలకొల్లు:నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు చెందిన చవాకుల చారిటబుల్ ట్రస్ట్ 2025 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ ను విజయవాడలో ఘనంగా సత్కరించారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఏటా ఈ అవార్డు ప్రధానం చేస్తారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నరేష్ ఈ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు ట్రస్ట్ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పలువురు ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.