పాండు ఎలమంచిలి నవంబర్ 26 తెలుగు న్యూస్ పేపర్ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాల్లో భాగంగా తెలుగు భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు, దొడ్డిపట్ల, యలమంచిలి, అడవిపాలెం దేవాలయాల భక్తులు ఉదయం నుంచి తరలివచ్చారు. పాలకొల్లు దాదాపు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా చిరు వ్యాపారం ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్ద ఈ పండుకు ముఖ్యమైన జీల్లు,ఖర్జూరాలతో పాటు పిల్లల ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ఊరేగించారు.


