ఉండ్రాజవరం: అక్టోబర్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్)నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సెంటర్‌లో ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. గతంలో ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి అడ్డంకులు ఎదురయ్యాయి. స్వయంగా రంగా కుమార్తె ఆశ ఇక్కడ నిరసన తెలిపారు. తరువాత జరిగిన పరిణామాలతో కూటమికి చెందిన కాపు నాయకులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ హాజరయ్యారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్, బత్తుల బలరామకృష్ణ, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. పేద ప్రజల కోసం రంగా చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
రంగా విగ్రహావిష్కరణలో కూటమి మంత్రులు, ప్రముఖులు.
వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ దృశ్యం