Skip to main content

Telugu News Power

ఉపాధ్యాయుని సస్పెన్షన్

పాలకొల్లు:డిసెంబర్,4 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని ఆగరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చల్లా రవికుమార్ ను అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుని పై అధికారులు ఈ చర్య తీసుకున్నారు. అయితే ఈ విచారణలో స్థానిక విద్యాశాఖ అధికారులు కాకుండా, బయట నుంచి వచ్చిన విద్యాశాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు సంయుక్తంగా,ఈ విచారణ చేసినట్టు సమాచారం. ఉపాధ్యాయునిపై వచ్చిన ఆరోపణ, యాదృచ్ఛికంగా జరిగిందా లేక ఉద్దేశం పూర్వకంగా చేసిందా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.