Telugu News Power

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్యాలయంలో శుక్రవారం రక్తదాన శిబిరం జరిగింది. ప్రాణాలు కాపాడే సాయం అందరూ చేయాలని, ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప అనుభూతి అనే నినాదంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ డిసెంబర్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ పసుపులేటి అశోక్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ రక్త కేంద్రం, భీమవరం వారు స్థానికంగా రక్తదాన ఏర్పాట్లు చేశారు. పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐదు బ్యాంకు బ్రాంచ్ ల సిబ్బంది ఈ శిబిరంలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 20 మంది ఈ రక్త దానం చేశారు. ముందుగా బ్రాంచ్ మేనేజర్ పసుపులేటి అశోక్ రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ రూప, కొల్లి గోవర్ధన్, బ్యాంకు సిబ్బంది ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేశారు.