పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ 3020 ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ప్రతిష్టను ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాలు, అందులో రోటరీ సభ్యుల యొక్క పాత్ర అనే అంశంపై ఆదివారం,రామచంద్ర గార్డెన్స్ లో సెమినార్ నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోటరీ జోన్7, పబ్లిక్ ఇమేజ్ చైర్మన్, ముఖ్య అతిధి,రోటరేరియన్ అభినందన్ ఈ అంశంపై సభ్యులకు అనుసరించవలసిన వివిధ వ్యూహాల గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివిధ ప్రసారమాధ్యమాల ద్వారా మరియు సోషల్ మీడియా లో ప్రచారం కల్పించి ప్రజల్లో రోటరీ ప్రతిష్ట పెంచే కార్యక్రమాలపై ఈ సదస్సులో సవివరంగా చర్చించారు. ఈ సదస్సుకు శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఉన్న ప్రతినిధులు సెమినార్ కు హాజరయ్యారు. స్థానిక రోటరీ అధ్యక్షులు డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద్ రాజు, సెమినార్ కు స్వాగతం పలికారు. జిల్లా పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ డాక్టర్ ముచ్చర్ల సంజయ్ సెమినార్ కు చైర్మన్ గా వ్యవహరించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ ముత్తవరపు సతీష్ బాబు సంచాలకులుగా సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్, గుత్తికొండ శ్రీరామ్, డిస్ట్రిక్ట్ ట్రైనర్ డివిఆర్ పూష, రోటరీ క్లబ్ పూర్వాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, మద్దాల రాంప్రసాద్,షేక్ పీర్ సాహెబ్, ఇమ్మిడి రాజేష్, ఎమ్మెస్ వాసు, మెగాపుల రాంబాబు, కావలి నగేష్, చందక రాము, క్లబ్ కార్యదర్శి పోతాబత్తుల సత్యనారాయణ, కోశాధికారి గంన్నాబత్తుల శ్రీనివాస్, తమ్మినీడి మురళి తదితరులు పాల్గొన్నారు.
