Telugu News Power

ఎయిడ్స్ బాధితులు పట్ల మానవత్వం చూపాలి – మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,7 (తెలుగు న్యూస్ పవర్) ఎయిడ్స్ బాధితుల పట్ల మానవత్వం చూపాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. నిమ్మల ధర్మారావు ఫౌండేషన్ వారి ద్వారా హెచ్ఐవి బాధితులకు సహాయం అందించిన సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం హెచ్ఐవి బాధితులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఉచిత పౌష్టికాహారం, నిత్యవసర సరుకులు, బ్యాగ్లు అందించారు. గత 20 ఏళ్లు గా తన తండ్రి పేరు మీద ఉన్న ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరిపే అదృష్టం కలిగిందన్నారు. హెచ్ ఐ వి బాధితులు భయపడవలసిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఇందుకు ప్రణాళిక బద్ధమైన వ్యాయామం చేయాలన్నారు. పౌష్టిక ఆహారం, మంచి మందులు తీసుకుని జీవనం సాగిస్తే ఆరోగ్యవంతులవుతారన్నారు ఎయిడ్స్ బాధితులకు 105 రకాల వైద్య సేవలను కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. హెచ్ఐవి బాధితుల సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. వచ్చే 2030 నాటికి హెచ్ఐవి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా మన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుగ్మతలు,విపత్తులు వంటి సమయాల్లో ముందుచూపుతో తీసుకునే చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కోరిన చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు,బోణం చినబాబు, కర్నేని గౌరు నాయుడు రోజారమణి ,పాములు రజనీ కుమార్, గొట్టుముక్కల రాజు, మామిడిశెట్టి
పెద్దిరాజు,పితల శ్రీనివాస్, శ్రీనివాస్ తులా రామలింగేశ్వర అంగర చిన్న పాలవలతో తులసిరావు బిడ్డ లక్ష్మీనారాయణ మేడిశెట్టి కేశవ,ముప్పిడి సత్యనారాయణ,వట్టం
గణేష్, ఆరమిల్లి చిన్ని, శివకృష్ణ ,ప్రభాకర్ ,శేషరాజ్యం ప్రసాదరాజు, నాయుడు, శశికళ తదితరులు పాల్గొన్నారు.