పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పేపర్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం నిర్వహిస్తున్నామంటున్న టెట్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష పై తక్షణమే రద్దు ఉత్తర్వులు కోరుతూ పాలకొల్లు మంగళవారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ముందుగా ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాత, అమరజీవి చెన్నుపాటి లక్ష్మయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇక్కడ నుంచి, టెట్ రద్దు కోరుతూ నినాదాలతో నిరసన ర్యాలీ మండల రెవెన్యూ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ, 30 ఏళ్లకు పైగా సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలనే నిబంధనలో ఎంత మాత్రం ఔచిత్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1న భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం, జరగబోయే కాలానికి కాకుండా,గతం నుంచి కూడా ఈ ఆదేశాలు అమలు చేయవలసి ఉంటుంది. ఈ ఉత్తర్వులు పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉపాధ్యాయ ప్రదేశం పిలుపుమేరకు యుటిఎఫ్ పాలకొల్లు,యలమంచిలి పోడూరు మండలాల పరిధిలో ఉపాధ్యాయులు ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టులు కౌంటర్లు దాఖలు చేయాలని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా నాయకులు కోరం రాజశేఖర్, పోలిశెట్టి క్రాంతి కుమార్, జీ లక్ష్మీనారాయణ, పిల్లి శ్రీనివాసరావు, ఎం రాజశేఖర్, దీవి నరసింహారావు, పలువురు ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
