Telugu News Power

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – డాక్టర్ కోసూరి రాజు

గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లు పంపిణీ

పాలకొల్లు:డిసెంబర్,9 (తెలుగు న్యూస్ పవర్) ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ఎం నవ్య జీవన్ గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేశారు. గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా ప్రమాదకరమైన లక్షణాలు కనిపిస్తే తరచూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రసవ సమయంలో ఏరియా ఆసుపత్రి స్త్రీ వ్యాధి నిపుణులనులను సంప్రదించాలని తెలియజేశారు. స్థానిక పాలకొల్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు, హోమియో వైద్యులు డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనందరాజు మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు బిడ్డ ఎదుగుదలకు అవసరమైన మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. ప్రతి నెల గర్భిణీ స్త్రీలు వారి రక్త శాతం ఎంత వరకు ఉందో తప్పక పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 35 మంది గర్భిణీ స్త్రీలకు పోషకాహార కిట్లు, పెరుగన్నం బాక్సులు ఉచితంగా అందించారు. ఆరోగ్య విస్తరణాధికారి గుడాల హరిబాబు, గర్భిణీ స్త్రీలకు మాత శిశు సంరక్షణ కార్డు పై అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పోతాబత్తుల సత్యనారాయణ, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, చందక రాము,ఎలిజిబెత్, రమేష్ బాబు, పీవీ స్వామి, సౌజన్య, ప్రియాంక, ఉదయ్ చందర్, సత్తిబాబు, కే ప్రసాద్, సిహెచ్ ప్రసాద్, బి లక్ష్మీనారాయణ, ఇతర వైద్యారోగ్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.