Telugu News Power

పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలి – వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి డిమాండ్.

సంతకాలు బాక్సులను స్వీకరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ముదునూరు
వైఎస్ఆర్సిపి మెడికల్ కాలేజీ ర్యాలీ

పాలకొల్లు:డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ బహుమానంగా ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడును వైఎస్ఆర్సిపి,పాలకొల్లు ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి,, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల తరలింపు ర్యాలీ పాలకొల్లు నుంచి భీమవరం వరకు సాగింది. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో గుడాల గోపి మాట్లాడుతూ, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశువులు మేస్తున్నాయని చెప్పిన మంత్రి, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఆనాడు సీఎం జగన్మోహన్ రెడ్డి 475 కోట్ల రూపాయలతో పాలకొల్లుకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేశారన్నారు. ఇప్పుడు పి పి పి.నమూనాలో ప్రైవేటు వారికి అప్పగించడం ప్రజలను మోసం చేయడమే అన్నారు. అలా కాదంటే, నీతి నిజాయితీ ఉంటే, వెంటనే పాలకొల్లు వైద్య కళాశాలను ప్రభుత్వ వైద్య కళాశాల గా మార్చడానికి ప్రభుత్వం తో పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. తట్ట మట్టి, అరబస్తా సిమెంటే అభివృద్ధి కాదన్నారు. పేద ప్రజలకు ఎంతో మేలు చేసే, ఈ కార్యక్రమం వైయస్సార్ సిపి చేపట్టిందన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య విద్య,వైద్యానికి దూరమవుతున్న భయంతోటే అరవై వేలకు పైగా సంతకాల ద్వారా తమ నిరసన తెలిపారు అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాధించుకోస్తే వైఎస్ఆర్సిపి కూడా మంత్రివర్యులు అభినందిస్తుందని గోపి హామీ ఇచ్చారు. ఈ సంతకాల సేకరణకు శ్రమించి, విజయవంతం చేసిన,కార్యకర్తలు నుండి నాయకులు వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చెల్లెం ఆనంద ప్రకాష్ ప్రకాష్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి, ఇతర పార్టీల వారిని అభినందించారు. సేకరించిన సంతకాల పెట్టె లతో భీమవరం తరలి వెళ్లారు. జిల్లా ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే, విప్ ముదునూరి ప్రసాద్ రాజు సంతకాల పెట్టెలను స్వీకరించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు ఎడ్ల తాతాజీ, ఎలమంచిలి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, వినుకొండ రవి,జోగాడ ఉమామహేశ్వరరావు పలువురు మహిళా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు