Skip to main content

Telugu News Power

పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకం

ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి

పాలకొల్లు:డిసెంబర్,11( తెలుగు న్యూస్ పవర్) పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర ఎంతో కీలకమని స్వచ్ఛ ఆంధ్ర ,స్వర్ణాంధ్ర కోఆర్డినేటర్ రోహిత్ విద్యానంద్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర,స్వర్ణాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం, కంపోస్ట్ తయారీ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎన్, రామకృష్ణ, వి విజయలక్ష్మి, కోఆర్డినేటర్ వి యామిని, తెలుగు శాఖ బి వెంకట స్వామి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.