పాలకొల్లు:డిసెంబర్,12 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు చెందిన నల్లా లీల సాయి లక్ష్మికి పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారు10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈమె ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఈమెకు ఫిజియోథెరపీ చికిత్స నిమిత్తం ఈ సహాయం అందజేశారు. ఈమె స్థానిక ఛాంబర్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న పోతాబత్తుల కీర్తనకు ఫీజు నిమిత్తం 6 వేల రూపాయలు ధన సహాయం చేశారు. యువతులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు ఆపకూడదని క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, జవ్వాజి కళ్యాణ్, గుడాల హరిబాబు, పెద గోపురం ట్రస్టీ బాసిన సత్యనారాయణ, వట్టం గణేష్, బాసిన గుణేశ్వరరావు, మనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.