Telugu News Power

కొబ్బరి రైతుకు ఊరట.

 

 

పాలకొల్లు:డిసెంబర్,13 (తెలుగు న్యూస్ పవర్ ) కొబ్బరి ధర 25- 26 రూపాయల నుంచి ఒక్కసారిగా, సగానికి పైగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రానున్న 2026 ఏడాదికి గాను కొబ్బరికి మద్దతు ధర ప్రకటించింది.
మిల్లింగ్ కోప్రా ధర 12,027 రూపాయలు. గతంలో ఈ ధర 11, 5 82 రూపాయలు ఉండేది. ఈ ఏడాది పెరుగుదల క్వింటాల్ కు 445 రూపాయలు.
బాల్ కోప్రా ధర 12,500 రూపాయలు. గత ఏడాది ఈ ధర 12,100రూపాయలు పెరిగిన ధర క్వింటాల్ కు 400 రూపాయలు. నేషనల్ అగ్రికల్చిన కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా,(నాఫెడ్)నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ సి సి ఎఫ్) ఈ కొబ్బరి కొనుగోలు చేస్తాయి. ఈ పెంపు వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక తదితర కొబ్బరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.