పాలకొల్లు డిసెంబర్ 15 తెలుగు న్యూస్ పవర్ స్థానిక రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనంద రాజు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థికి ఆర్థిక సహాయం అందించారు. పెదమామిడిపల్లి కి చెందిన కుక్కల యామిని సత్యలక్ష్మి ఓ ప్రైవేటు కాలేజీకి చెల్లించవలసిన ఫీజు 7500 రూపాయలు ఉపకార వేతనం గా అందించారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థుల చదువు కొనసాగించడానికి రోటరీ క్లబ్ సభ్యులు సహాయపడతారని రాజు తెలిపారు. ఈ కార్యక్రమం క్లబ్ మాజీ అధ్యక్షులు షేక్ పీర్ సాహెబ్, కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్, కోశాధికారీ గన్నాబత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.