డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) గత102 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న కురువృద్ధులు ఏటుకూరి కృష్ణమూర్తి. గుంటూరు జిల్లా ఏటుకూరులో వీరు1923 లో జన్మించారు. ఏటుకూరి సీతారామయ్య లక్ష్మీబాయమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు 1948లో రెవెన్యూ శాఖలో 37 రూపాయల జీతానికి చేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వీరి మొదటి కార్య స్థానం. వీరు 1978 లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. గత 47 ఏళ్లుగా వీరు పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం 103వ ఏట అడుగు పెట్టబోతున్నారు. వీరు తమ కుమారుని దగ్గర హైదరాబాదులో ఉంటున్నారు. బహుశా ఇది ప్రపంచ రికార్డు కావచ్చు.
వీరు స్వతంత్ర సమర యోధులు. జైలు జీవితం అనుభవించారు. అంతకుముందు కొంతకాలం బ్రిటిష్ నావికాదళంలో పనిచేశారు. ఉద్యోగ ఉద్యమాలను నడిపారు. మరుగున పడిన స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర రచించి ఉచితంగా పంచారు.
నేడు పెన్షనర్స్ డే సందర్భంగా ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు పాలంకి సుబ్బరాయన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
102 నాట్ అవుట్ పెన్షనర్ ఏటుకూరి కృష్ణమూర్తి
ఏటుకూరి కృష్ణమూర్తి 102 ఏళ్ల పెన్షనర్