వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ
పాలకొల్లు,డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రైతులు దాళ్వా వరి నారుమళ్ళు వెంటనే వేయాలని వ్యవసాయ సహాయ సంచారకులు మురళీకృష్ణ రైతులకు సూచించారు. పాలకొల్లు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ 90 శాతం నారు మళ్ళు ఇంకా వేయవలసి ఉందన్నారు. ఈ సబ్ డివిజన్లో గల పాలకొల్లు మండలం లో 4198 హెక్టార్లు , పోడూరు మండలంలో 5708 హెక్టార్లు, ఆచంట మండలంలో 4259 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయా మండలాల్లో 20.5, 35.0, 36.0 హెక్టార్ల కు మాత్రమే వరి నారుమళ్ళు వేసినట్టు తెలిపారు. దాళ్వాకు ఎం టి యు రకానికి చెందిన 1121,1159,1156, 1282,3236 తదితర రకాలు అనుకూలంగా ఉంటాయన్నారు.
ఎరువుల కొరత లేకుండా అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులకు కావలసిన కాంప్లెక్స్, యూరియా నిల్వలు సిద్ధంగా ఉంచామన్నారు. యూరియా పాలకొల్లు మండలంలో158, పోడూరులో 635, ఆచంటలో 135 మెట్రిక్ టన్నులు రైతుల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా తాడేపల్లిగూడెం గొడౌను లో 4000 మెట్రిక్ టన్నుల నిల్వలు జిల్లాకు సరిపడా ఉన్నాయన్నారు.
నారుమడులు త్వరగా వేయాలి