Skip to main content

Telugu News Power

యలమంచిలి మండలానికి 33 కైలాస వనాలు.

ఏ ఈ నాగేశ్వరరావు తో చర్చిస్తున్న టిడిపి నాయకులు తాళ్లూరి శ్రీనివాస్.

యలమంచిలి: డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలంలో ఉన్న 32 గ్రామాలకు గాను 33 స్మశాన వాటికల అభివృద్ధి, సుందరీకరణకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిధులు మంజూరు చేయించినట్టు పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి తో యలమంచిలి స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకారణ గురించి చర్చించారు. స్మశాన వాటిక వద్ద గోదావరి కోతకు గురవతున్నందున గ్రోయన్స్ వేయాలన్నారు. స్మశానానికి వెళ్లే రోడ్డుకు స్థల సేకరణకు కృషి చేస్తానని బుజ్జి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనుల కు సంబంధించి రూపులను త్వరలో అందజేస్తామన్నారు. ఈ పనులకు నిధులు అదనంగా మంజూరయ్యే అవకాశం ఉందని ఏఈ తెలిపారు.