Telugu News Power

పశువుల ఆసుపత్రి సమస్యలకు పరిష్కారం.

పాలకొల్లు:డిసెంబర్, 20( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోకాలంగా తిష్ట వేసిన సమస్యల బంధాలకు, దాతల సహకారంతో విముక్తి కలిగింది. పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో పశువులు పరీక్షలకు ఉపయోగించే బోనులు ఉన్న చోటు దాదాపు అడుగులోతు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. బోనులు తుప్పు పట్టి, పాడైపోయి ఉన్నాయి. ఇందుకుగాను ప్లాట్ ఫామ్ ఎత్తు చేయటానికి, కొత్త బోనులు ఏర్పాటుకు,అవసరమైన నిధులు 55 వేల రూపాయలు దాతలు సమకూర్చినట్టు పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ జి సత్యనారాయణ శనివారం తెలిపారు. దాతలు గాదె వెంకన్న , మార్లపూడి ఉదయ్ కుమార్, డి బుల్లబ్బాయి. జి రామలింగేశ్వరరావు, మారెళ్ళ మాణిక్యాలరావు, ప్రసాద్, బాబి, కుంపట్ల రాజు, చోడిశెట్టి జ్ఞానశంకర్ విరాళాలు ఇచ్చారు. ఈ పనులు పూర్తయిన సందర్భంగా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గండేటి వెంకటేశ్వర రావు, మండెల రాంప్రసాద్, బి సోమశేఖర్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.