Telugu News Power

ఇసుక లారీల బంద్

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధాన స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, దందాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్ల సంఘం ఇసుక లారీల బంద్ తో నిరసన తెలుపుతుంది. ఈ మేరకు ఆ సంఘ అధ్యక్షులు రావూరి రాజా పలు డిమాండ్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చా వచ్చారు. రాంప్ లో అనధికార వసూళ్లు ఆపు చేయించాలని కోరారు. కొవ్వూరు-పెరవలి మధ్య టాస్క్ ఫోర్స్, లారీ వారిని బెదిరించి, అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి లారీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినియోగదారుల అవసరాల దృష్ట్యా, ప్రభుత్వం విధించిన పరిమితికి మించి ఇసుక తరలిస్తున్నప్పుడు, అధికారులు చర్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అపరాధ రుసుము 25 వేల రూపాయలు రద్దు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం, మైనింగ్ ఏడి, కొవ్వూరు ఆర్డీవోలకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఆ మేరకు తమ డిమాండ్ల సాధన కోసం ఆదివారం నుంచి లారీలు నడపకుండా బందు చేస్తున్నమని వెల్లడించారు.