Telugu News Power

విద్యార్థుల హస్తకళల ప్రదర్శన

విజేతలతో అధ్యాపకులు

పాలకొల్లు;డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) వినియోగదారుల వారోత్సవాలు భాగంగా స్థానిక ఏఎస్ ఎన్ ఎమ్ ప్రభుత్వ కళాశాలలో హస్తకళల ప్రదర్శన, అమ్మకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ టీ కృష్ణ,మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలు, స్వయం ఉపాధికి దారులు పడతాయని అన్నారు. విద్యార్థులు తాము తయారుచేసిన హస్త కళల వస్తువులను ప్రదర్శించారు. వాటిని అమ్మకానికి ఉంచారు. వాణిజ్య విభాగం, కన్జ్యూమర్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని జరిపాయి. ఈ కార్యక్రమంలో కె భద్రాచలం డాక్టర్ ఎం రామకృష్ణ డాక్టర్ సిహెచ్ ఉషారాణి డాక్టర్ వి విజయలక్ష్మి జీడి శ్రీనివాసరావు, రామలక్ష్మి, దుర్గేశ్వరి,ఆశాజ్యోతి మన్మధరావు, స్వర్ణలత విద్యార్థులు పాల్గొన్నారు.

హస్త కళల వస్తువులను పరిశీలిస్తున్న ఇంచార్జ్ ప్రిన్సిపల్