పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక విద్యుత్తు ఉపకేంద్ర వద్ద పాలకొల్లు ఏడిఈ సిహెచ్. రామకృష్ణ, ఏఇ షేక్ కొడాన్ సబ్జీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసే పని చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కార్యాలయం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం, ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుందన్నారు. ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రం చేసి, మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. వినియోగదారులకు ఇబ్బంది కలక్కుండా, కార్యాలయ పని గంటలకు ముందే ఈ కార్యక్రమం పూర్తి చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉపకేంద్రం సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
విద్యుత్ ఉపకేంద్రం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం.
పాలకొల్లు విద్యుత్ ఉపకేంద్రం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం