Skip to main content

Telugu News Power

చాంబర్స్ లో క్రిస్మస్ సంబరాలు

క్రిస్మస్ కేక్ కటింగ్ కార్యక్రమంలో చైర్మన్ నరసింహారావు

పాలకొల్లు; డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాలతో జరిగాయి. విద్యార్థులు నాటికలు ప్రదర్శించారు. శాంతా క్లాస్ మధ్య మధ్యలో చాక్లెట్ బహుమతులు విసిరారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఏడాది చక్కని ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలను కొనియాడారు. పరమత సహనం పాటించాలన్నారు. కళాశాల కార్యదర్శి సీతారామరాజు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, డాక్టర్ మూర్తి, జానకి రామయ్య, మీనా, శాంతి సురేఖ, డానియల్ సిరి చందన, ఆదిత్య, రవికుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.

చాంబర్స్ కాలేజీలో క్రిస్మస్ వేడుకలు