Telugu News Power

వాడవాడలా క్రిస్మస్ వేడుకలు

కాస్మో క్లబ్ లో క్రిస్మస్ సంబరాల్లో గాంధీ భగవాన్ రాజు

పాలకొల్లు: డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వాడవాడలా క్రీస్తు బోధనలు బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు జరుగుతున్నాయి. క్రీస్తు బోధించిన ప్రేమ,కరుణ,దయ గుణాలు ప్రపంచానికి శాంతి, సౌబ్రాత్రుత్వాన్ని అందిస్తాయని బోధకులు కీర్తించారు. ఈ కార్యక్రమాల్లో పిల్లలు,పెద్దలు భక్తి భావంతో, ఉత్సాహంగా ప్రార్థన చేశారు. క్రిస్మస్ కోరల్స్ పాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ క్రిస్మస్ వేడుకల్లో స్వయంగా పాల్గొని దీవెనలు అందుకున్నారు. వివిధ సంస్థలలో క్రిస్మస్ జరుపుకున్నారు. పాలకొల్లు కాస్మో పాలిటన్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, సిబ్బందితో కలిపి క్రిస్మస్ పండుగ జరుపుకున్నారు.

త్రిత్రైక ప్రభు చర్చ్