Telugu News Power

తూర్పు కాపు సమస్య పరిష్కరిస్తాం- గుడాల గోపి

ఓ బి సి సమావేశంలో గుడాల గోపి

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పపర్)
తూర్పు కాపులను ఓబీసీలుగా గుర్తించడానికి ఇది సరైన సమయమని పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తూర్పు కాపు నాయకులతో శుక్రవారం మాట్లాడారు. గతంలో ఈ సమస్యపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించామన్నారు. అయితే అప్పుడు సమయం లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కరించ లేకపోయామన్నారు. ఈ విషయమై జగనన్న కలిసి మరోసారి విజ్ఞప్తి చేద్దామని ప్రకటించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నందున, ఈ సమస్య తక్షణమే పరిష్కరించే వీలుందని, ఇప్పుడే గట్టిగా పోరాడాలని కోరారు. ఇందుకు తాము కూడా సహకరిస్తామన్నారు. అప్పటికి పరిష్కారం కాకపోతే, 2029 తర్వాత జగనన్నతో ఈ సమస్య పరిష్కరింప చేస్తామన్నారు. ఈ సమావేశంలో మురళీ కృష్ణంరాజు, కోరాడ శ్రీనివాస్, వాకాడ అప్పారావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, తూర్పు కాపు నాయకులు పాల్గొన్నారు.