Skip to main content

Telugu News Power

జిల్లా ప్రధాన కార్యదర్శిగా క్రాంతి ఏకగ్రీవం.

యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజు, క్రాంతి

యలమంచిలి, డిసెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండలం, పెంటపాడు లో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పిఎస్ విజయరాజు జిల్లా అధ్యక్షులుగా, పి శివప్రసాద్ జిల్లా కోశాధికారి పదవులకు ఎంపికయ్యారు. ప్రస్తుతం క్రాంతి జిల్లా ఇంచార్జ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుటిఎఫ్ సంఘానికి వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరు స్థానిక పెనుమర్రు పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి యుటిఎఫ్ శాఖ, జిల్లా యుటిఎఫ్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే మండలానికి చెందిన బి శైలజ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. మండల శాఖ వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు.