నరసాపురం: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో ఉన్న 700 జిల్లాల్లో పెదమైవానిలంక, నైపుణ్య శిక్షణ కేంద్రం రెండవ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు పార్లమెంట్ సభ్యులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, నిర్మల సీతారామ ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బడ్గం జిల్లా మొదటి స్థానంలో నిలువగా, పెదమైనవానిలంక, విశ్వకర్మ శిక్షణ కేంద్రం రెండో స్థానం సాధించినందుకు తనుకు సంతోషంగా ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. నియోజకవర్గంలోని పెదమైనవానిలంక సముద్రపు కోత నిరోధానికి సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రి ఆదివారం పీఎం లంకలో పర్యటించారు. కేంద్ర ఆర్థికమంత్రి వెంట, రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తరలి వచ్చారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ దంపతులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ శిక్షణా కేంద్రాల పనితీరు, నాణ్యత, ఉద్యోగాల లభ్యత పై సర్వే నిర్వహించినట్టు తెలిపారు. సర్వేలో ఈ ఘనత సాధించినట్టు వెల్లడించారు. ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకోలేదని, తననే ఈ గ్రామం 2014 లోనే దత్తత తీసుకున్నదని సంతోషం వ్యక్తం చేశారు. మొదటిసారి వచ్చినప్పుడు, తూర్పు తాళ్ళు, పీఎం లంక మహిళలు తనకు ఎంతో సహాయ సహకారాలు అందించారన్నారు. ముందుగా మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేశానన్నారు. ప్రకృతి విపత్తులకు పనికొచ్చేలా, విద్యార్థుల చదువులకు ఉపయోగపడేలా అప్పట్లో ఈ పెద్ద భవనం కట్టడం జరిగిందన్నారు. ఆ తరువాత ఈ భవనం బహుళ ప్రయోజనాలకు వేదిక అయిందన్నారు. సహచర ఎంపీలు ఈ భవనం గురించి అడుగుతారని, అయితే ఈ భవనం కట్టినప్పుడు ఇంతగా ఉపయోగపడుతుందని ఊహించలేదన్నారు. ఈ భవనం రెండేళ్ల క్రితం విశ్వకర్మ యోజన పథకంలో 13 రకాల నైపుణ్యాలకు శిక్షణ కేంద్రంగా వాడుకలోకి వచ్చిందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉద్యోగాలు పొందినట్టు చెప్పడం సంతోషం కలిగించిందన్నారు. ఆంధ్ర కోడలు, పెదమైన వాని లంకకు మాత్రం కూతురుగా ఇక్కడ మహిళలు తనను ఆదరించి, అక్కున చేర్చుకోవడం తనను ఉద్వేగానికి గురిచేసి, హృదయానికి తాకిందన్నారు. మహిళలు సముద్ర కోత గురించి తన దృష్టికి తీసుకురాగా, ఇక్కడ బీచ్ సుందరీకరణకు ఏ విధమైన అడ్డంకి లేని విధంగా, సముద్రపు కోతను అరికట్టే ఒక ఆధునిక సాంకేతికత నిర్మాణం జరుగుతుందని, ఇది జనవరి కి పూర్తి కావచ్చని మంత్రి వెల్లడించారు. ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసం డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ, ఆన్లైన్ అమ్మకాలు గురించి శిక్షణ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. సియంట్ కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సి ఎస్ ఆర్ నిధుల ద్వారా శిక్షణకు అవసరమైన కంప్యూటర్లు, డ్రోన్స్ వంటివి అన్నీ వారే ఏర్పాటు చేసి, శిక్షకులను కూడా రప్పించి శిక్షణ ఇస్తారన్నారు. పీఎం లంక ప్రజలకు అవసరమైన ఇల్లు, పడవలు తదితర అవసరాలను ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ మంత్రులకు, అధికారులకు సూచించారు. డబల్ ఇంజన్స్ సర్కార్ వల్ల ప్రజలకు ఈ విధంగా ఎంతో మేలు జరుగుతుందఅన్నారు. పీఎం లంక ఇక ఎంత మాత్రం మారుమూల ప్రాంతం కాదని, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ శిక్షణ పొందు నందున, పీఎం లంక సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మారిందన్నారు. , పదో తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు ఏఐ కు సంబంధించి ఏది నేర్చుకోవాలన్నా పీఎం లంక రావాల్సిందే అన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఇక్కడ ప్రజలు తమ గ్రామ అభివృద్ధి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, సముద్ర కోత నివారణకు చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో ప్రయోగశాలను ప్రారంభించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు వంటి భారీ పనులు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వల్ల, వేగంగా జరుగుతున్నాయని, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు,నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్మల సీతారామన్ ప్రజలతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా అధ్యక్షులు శ్రీదేవి, డీసీఎంఎస్ అధ్యక్షులు, టిడిపి ఇన్చార్జ్ పొత్తూరు రామరాజు, కూటమి నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
