Skip to main content

Telugu News Power

జంగిల్ బుక్ సృష్టికర్త పుట్టినరోజు వేడుక

రుద్యాడ్ కిప్లింగ్

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రుద్యాడ్ కిప్లింగ్ సాహిత్యం యువతలో నైతిక విలువలు, దేశభక్తి,మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తుందని ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి పేర్కొన్నారు. జంగిల్ బుక్ సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత రుద్యార్డ్ కిప్లింగ్ జయంతి మంగళవారం స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులు జి డి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. జంగిల్ బుక్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, నోబుల్ బహుమతి తెచ్చి పెట్టిందన్నారు. జంగిల్ బుక్ పుస్తకంలోని పాత్రలు మానవ సహజ బలాలు, బలహీనతలు ఆవిష్కరిస్తాయన్నారు. ఎంతో కళాత్మకంగా వీరి రచనలు తీర్చిదిద్దారన్నారు. విద్యార్థులు అభివృద్ధిలోకి రావడానికి వీరి రచనలు మార్గదర్శనం చేస్తాయన్న రు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, భూసి వెంకటస్వామి, ఉషారాణి, విజయలక్ష్మి పార్థసారథి రమేష్ కుమార్ శిరీష శివకృష్ణ, శ్రీనివాసరావు, దుర్గేశ్వరి, ఆశాజ్యోతి, మన్మధరావు, స్వర్ణలత, జోష్ణ, రామలక్ష్మి, పెప్సీ రాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి ప్రసంగిస్తున్న చిత్రం