Skip to main content

Telugu News Power

ఒకటి వద్దులెండి, ఉగాది ముద్దండి.

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) రేపు రానున్న సంవత్సరాది, జనవరి ఒకటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకోవడం అనాదిగా, అనవాయితీగా వస్తున్నది. గతంలో శుభాకాంక్షల కార్డులు పంచుకునేవారు. ఆ తర్వాత డిజిటల్ కార్డులు రాజ్యమేలుతున్నాయి. మొదటి నెల, మొదటి రోజు, ఒకటో తారీకు మంది,మార్బలం, అధికార బలం ఉన్నచోట ఇది భారీ ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. సాంప్రదాయ బద్ధమైన పంచాంగాలు కూడా, ఆంగ్ల సంవత్సరాదిని అనుసరించడం ప్రస్తుతం జరుగుతున్నది. అయితే ఇటీవల కాలంలో బిజెపి మోడీ వల్ల, సనాతన ధర్మం వైపు వెళ్లడంవల్లో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ విషయం విస్తృతంగా సోషల్ మీడియాలో విజృంభిస్తుంది. కొందరు ప్రముఖులు ముందే తమకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపవద్దని నిక్కచ్చిగా చెబుతున్నారు. చూద్దాం ఒక్కరోజే కదా, మార్పు ఏ మేరకు ఉంటుందో!