పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) ఉద్యోగులు సంక్షేమం కోసం ఏపీఎన్జీవో అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. సంఘంలో సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సభ్యులు తమ సమస్యలు సంఘ దృష్టికి తీసుకురావాలని కోరారు. వీటిని సంఘం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్ మాట్లాడుతూ, 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంఘం, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎన్నో జి ఓ లు తీసుకురాగలిగిందన్నారు. వీటిని సంఘపరంగా కాపాడుకోవలసి ఉందన్నారు. జిల్లా అడ్ హాక్ కమిటీ చైర్మన్ యు వి పాండురంగారావు మాట్లాడుతూ, సంఘ నిర్మాణంలో యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ యూనిట్ ఎన్నికలు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్ నందు బుధవారం జరిగాయి. ఈ ఎన్నికలకు తణుకు యూనిట్ కార్యదర్శి జున్నూరు శ్రీనివాస్, వై రాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మూర్తి, పరిశీలకులు గా ఉన్నారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించి, పరిశీలించిన తరువాత ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు ప్రకటించారు. గుడాల హరిబాబు, అధ్యక్షులుగా, గుబ్బల ప్రసాదు, కార్యదర్శిగా, రమేష్ రెడ్డి ఉపాధ్యక్షులుగా, కిరణ్మయి కోశాధికారిగా, 15 మంది సభ్యులుగా కమిటీ ఏర్పాటయింది. వీరి చేత పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మహిళ కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కృష్ణాజిల్లా హెడ్ హాక్ కమిటీ అధ్యక్షులు ఇవి పాండురంగారావు, డాక్టర్లు, జయ, సుప్రజ, నవ్య జీవన్, చంద్రశేఖర్, ముని త్యాగి, తదితరులు పాల్గొన్నారు.