
పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు సంబరపడ్డారు. నేడు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి, స్థానిక మిఠాయి దుకాణాల్లో ప్రజలు రద్దీగా కనిపించారు. ముగ్గులు, పూలు పళ్ళు అమ్మే దుకాణాల వద్ద సందడి కనపడింది. రోడ్డుపక్క ఏర్పాటు చేసిన బిర్యాని దుకాణాల వద్ద జనం ఎగబడ్డారు.

ఈ సందర్భంగా పెనుమదం రోడ్డు, ఎడ్ల బజారు సెంటర్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులు కలగ చేసుకోవలసి వచ్చింది. తీర్థం పుచ్చుకునే వారి సంఖ్య అధికంగానే కనపడింది.
వంద నుంచి 130 వరకు ఆఫ్ ప్యాకెట్ కొన్నట్టు తెలిపారు. చర్చలన్నీ సాయంత్రానికి నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలకడానికి సిద్ధం చేశారు. కొంతమంది ఈ పండగ వద్దని పిలుపునివ్వగా, మరికొందరు అవేవీ పట్టించుకోకుండా వేడుకల్లో మునిగితేలారు.
