Skip to main content

Telugu News Power

డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు

అవగాహన సదస్సు లో పాల్గొన్న అధికారులు

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే శారీరక,మానసిక,సామాజిక, చట్టపరమైన సమస్యలపై విద్యార్థులకు స్థానిక సీఐ కే రజని కుమార్ వివరించారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం డ్రగ్స్ వ్యసన నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ తో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎస్సై జి పృద్వి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల పడే శిక్షలు గురించి వివరించారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్, రసాయన శాస్త్ర విభాగం, యునైటెడ్ కాపు వనిత సర్వీస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, కాపు ఇంటర్నేషనల్ అధ్యక్షులు పి రామ్మోహన్రావు, డాక్టర్ కే మౌని కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.