Telugu News Power

చిరంజీవి సినిమా టికెట్ ధర లక్ష పదహారు వేలు

అమలాపురం: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “మన శివశంకర వరప్రసాద్” సినిమా టికెట్ ధర, కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. స్థానిక అమలాపురం, వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. రాష్ట్ర బిజెపి నాయకులు మోకా వెంకట సుబ్బారావు లక్ష 16 వేల రూపాయల వేలంలో ఈ టిక్కెట్టు రాష్ట్రంలోనే అత్యధిక ధర చెల్లించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, బిజెపి నాయకులు సుబ్బారావుకు అభినందనలు తెలియజేశారు. హైదరాబాదులో జరిగే ఆడియో ఫంక్షన్ లో ఈ టిక్కెట్టు చిరంజీవి కుమార్తె, శ్రీజ, ప్రత్యక్షంగా సుబ్బారావుకు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి తప్పక రావలసిందిగా సుబ్బారావును ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, కంచిపల్లి అబ్బులు, ప్రగడ వారి సత్రం చైర్మన్ గొర్తి పవన్, చాంబర్ అధ్యక్షులు కల్వకొలను తాతాజీ, మండెల బాబి, చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు నల్ల చిట్టిబాబు, నాయుడు, ఏడిది శ్రీను, జనసేన నాయకులు సుధా చిన్న, మహా దశ నాగేశ్వరావు, పప్పుల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.